‘వాల్మీకి ‘ ప్రీ-టీజర్‌ వచ్చేస్తుంది..

తమిళ సూపర్ హిట్ ‘జిగార్తాండ’ కు రీమేక్ గా తెలుగులో వాల్మీకి చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. గబ్బర్ సింగ్ ఫేమ్ హరీష్ శంకర్ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తుండగా మెగా హీరో వరుణ్ తేజ్ ..తమిళ్ హీరో అధర్వ మురళి నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.

ఈ నేపథ్యంలో సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచేందుకు చిత్ర ప్రీ-టీజర్‌ను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు చిత్ర యూనిట్. ఈ మేరకు రంజాన్ పండుగను పురష్కరించుకుని దర్శకుడు హరీష్ శంకర్ ట్విట్టర్ ద్వారా ఒక ప్రకటన చేశారు.

‘ఈ పవిత్రమైన రోజున వాల్మీకి టీమ్ తరఫున ఈ ప్రకటన చేయడం ఆనందంగా ఉంది. ప్రీ-టీజర్‌తో అతి త్వరలో మీకు సర్‌ప్రైజ్ ఇవ్వబోతున్నాం’ అని హరీష్ శంకర్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. మరి ఈ ప్రీ-టీజర్‌ను ఎప్పుడు విడుదల చేస్తారో చూడాలి. ఈ చిత్రాన్ని 14 రీల్స్‌ ప్లస్‌ పతాకంపై రామ్‌ ఆచంట, గోపీ ఆచంట నిర్మిస్తున్నారు. రాక్‌స్టార్ దేవీశ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తున్నారు. ఆయానకా బోస్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.