ఏపీ లో బదిలీ అయినా ఐఏఎస్ అధికారులు వీరే..

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గా బాధ్యతలు చేపట్టిన వైఎస్ జగన్..తన దూకుడు ను కనపరుస్తున్నారు. ఇప్పటికే పలువురి అధికారులను బదిలీ చేసిన ఆయన..ఈరోజు ఏకంగా 36 మంది ఐఏఎస్ అధికారులకు స్థానచలనం కల్పించారు. కృష్ణా, కడప, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలు మినహా మిగతా తొమ్మిది జిల్లాల కలెక్టర్లను బదిలీ చేసింది.

ఇక బదిలీ ఆయిన అధికారులు ఎవరా అంటే..

* రంజిత్‌బాషా- జీఏడీకి రిపోర్ట్ చేయాలని ఆదేశం
* సీతారామాంజనేయులు- రవాణాశాఖ కమిషనర్‌
* కె.హర్షవర్దన్‌- సాంఘిక సంక్షేమశాఖ డైరెక్టర్‌
* ప్రవీణ్‌కుమార్- వ్యవసాయశాఖ కమిషనర్‌
* కసిరెడ్డి రాజేంద్రనాథ్‌రెడ్డి- ఏపీ విజిలెన్స్‌ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్‌ జనరల్‌
* కాంతిలాల్ దండే- ఇంటర్‌విద్యాశాఖ కమిషనర్‌
* కన్నబాబు- జీఏడీకి రిపోర్ట్‌ చేయాల్సిందిగా ఆదేశం
* గిరిజాశంకర్- పంచాయతీరాజ్‌ కమిషనర్‌
* జె.మురళి- సీఎం ఓఎస్‌డీ
* కె.విజయ- సీఆర్డీఏ అదనపు కమిషనర్‌
* చిరంజీవి చౌదరి- ఉద్యానశాఖ కమిషనర్‌
* జేఎస్‌వీ ప్రసాద్- ఉన్నతవిద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి
* నీరబ్‌కుమార్ ప్రసాద్- అటవీశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి
* ఆదిత్యనాథ్ దాస్- జలవనరులశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి
* అజయ్‌ జైన్‌- జీఏడీకి రిపోర్ట్ చేయాల్సిందిగా ఆదేశం
* ఆర్‌పి.సోసిడియా- జీఏడీ రాజకీయ ముఖ్య కార్యదర్శి
* కె.విజయానంద్‌- జీఏడీకి రిపోర్ట్‌ చేయాల్సిందిగా ఆదేశం
* బి.రాజశేఖర్- పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి
* ఎం.టి.కృష్ణబాబు- ఆర్‌అండ్‌బీ ముఖ్య కార్యదర్శి
* కె.దమయంతి- మహిళా శిశు సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి
* ముకేష్‌కుమార్ మీనా- సాంఘిక, గిరిజన సంక్షేమశాఖ కార్యదర్శిగా
* బి.శ్రీధర్- జెన్‌కో, ఇంధనం, మౌలికవనరులశాఖ ఎండీ
* పూనం మాలకొండయ్య- వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శి
* కరికాల వలెవన్- బీసీ సంక్షేమశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి
* కే.ఎస్‌.జవహర్‌రెడ్డి- వైద్య ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి
* జి.అనంతరాము- గృహనిర్మాణశాఖ ముఖ్య కార్యదర్శి
* కె.ప్రవీణ్‌కుమార్- యువజన సర్వీసుల ముఖ్య కార్యదర్శి

జిల్లా కలెక్టర్లు :-

* ప్రకాశం- పి భాస్కర్‌
* తూర్పు గోదావరి- మురళీధర్‌రెడ్డి
* పశ్చిమ గోదావరి- ముత్యాల రాజు
* గుంటూరు- శ్యామూల్‌ ఆనంద్‌
* నెల్లూరు- ఎంవీ శేషగిరిబాబు
* అనంతపురం- ఎస్‌ సత్యనారాయణ
* విశాఖపట్నం- వి వినయ్‌చంద్‌
* కర్నూలు- జి వీరపాండ్యన్‌
* చిత్తూరు- నారాయణ భరత్‌ గుప్తా