బిగ్ బాస్ 3 లో ఆ ఇద్దరు ఉంటె షో ఎక్కడికో వెళ్తుందంటున్న కత్తి మహేష్..

తెలుగులో బిగ్ బాస్ సీజన్ 1 , 2 లు సక్సెస్ కావడం తో మూడో సీజన్ ఫై అందరిలో ఆసక్తి నెలకొని ఉంది. మూడో సీజన్ కు హోస్ట్ ఎవరు? కంటెస్టెంట్స్ ఎవరు? ఎప్పటి నుండి ప్రసారం కాబోతుంది? వంటి వాటి గురించి మాట్లాడుకున్నారు. ఈ నేపథ్యంలో సినీ విశ్లేషకులు కత్తి మహేష్ ఈ షోలో ఎవరు ఉంటే బాగుంటుందన్న దానిపై తన అభిప్రాయాన్ని వ్యక్త పరిచారు.

హోస్ట్ విషయానికి వస్తే.. తారక్ చేసినట్టు నాని చేయలేకపోయాడు కాని ఆ ఇద్దరిలో ఉన్న తేడా కూడా ఆ షోని మరోస్థాయికి తీసుకువెళ్లింది. అయితే ఈసారి నాగార్జున హోస్ట్ చేయబోతున్నారని ప్రచారం నడుస్తోంది. అదే నిజమైనతే నాగార్జున టెలివిజన్ షోలలో చాలా కంఫర్టబుల్. అది ‘మీలో ఎవరుకోటీశ్వరుడు’తో నిరూపించారు.

ఇక కంటెస్టెంట్స్ విషయానికి వస్తే.. మన అందరి ఊహలకు భిన్నంగా సీజన్ 1, 2కంటే కలర్ ఫుల్‌గా ఉంటుందనే నేను అనుకుంటున్నాను. అయితే ఎవరు కంటెస్టెంట్స్‌గా ఉంటే బావుంటుందన్న విషయానికి వస్తే.. వివాదాస్పద నటి శ్రీరెడ్డి ఉండాలనేది నా కోరిక. ఎందుకంటే ఆమె షోకి డిఫరెంట్ కలర్స్‌ని యాడ్ చేయగలదు. తను బిందాస్‌గా మాట్లాడే విధానం కాని.. సినిమాలు, రాజకీయాలపై ఆమెకు మంచి అవగాహన ఉంది. వాటితో ఆమెకు గుర్తింపు లభించవచ్చు.

అలానే జనసేన నాయకుడు, నటుడు నాగబాబు కూడా బిగ్ బాస్‌లో ఉంటే బాగుంటుంది. ఎందుకంటే బిగ్ బాస్ హౌస్‌లో ఓ సీనియర్ ఫిగర్ ఒకరు ఉండాలి. నాగబాబు అటు రాజకీయాల పరంగా.. ఇటు టెలివిజన్ పరంగా అందరికీ తెలిసిన వ్యక్తి ఆయన. ఈ మధ్య కాలంలో ఆయన చాలా ఇంట్రస్టింగ్‌గా మారారు. కాబట్టి నాకు బిగ్ బాస్ 3లో శ్రీరెడ్డి, నాగబాబు ఇద్దరూ ఉంటే షో నెక్స్ట్ లెవల్‌కి వెళ్తుందని నా కోరిక’ అంటూ చెప్పుకొచ్చారు.