‘సూపర్‌ 30’ ట్రైలర్ టాక్ ..

హృతిక్‌ రోషన్‌ హీరోగా మృణాల్‌ ఠాకూర్‌, టీవీ నటుడు నందిష్‌ సింగ్‌ తదితరులు ఇతర పాత్రల్లో తెరకెక్కిన చిత్రం చిత్రం సూపర్ 30 . ప్రముఖ గణిత శాస్త్రవేత్త ఆనంద్‌ కుమార్‌ బయోపిక్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రం జూలై 12న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో ఈ చిత్ర ట్రైలర్ ను విడుదల చేసి సినిమా ఫై ఆసక్తి నింపారు.

‘భారత్‌.. ఓ చీప్‌ లేబర్ దేశం అంటుంటారు. మరి పెప్సికో సంస్థకు అధినేతగా వ్యవహరించింది ఎవరు?యూనిలివర్‌ సంస్థను ఎవరు నడిపిస్తున్నారు..? ఈ విషయాలు ఎవ్వరికీ తెలీకపోతే గూగుల్‌లో వెతకండి. అంతేకాదు గూగుల్‌ను శాసిస్తోంది ఎవరో కూడా అందులోనే తెలుసుకోండి. వీరందరూ మన భారతీయులే కదా’ అన్న డైలాగ్‌తో ట్రైలర్‌ మొదలు పెట్టారు.

ఆనంద్‌కుమార్‌ పాత్రలో హృతిక్‌ రోషన్‌ ప్రాణం పోసారు. ఓ విద్యా సంస్థ ఐఐటీ ప్రొఫెసర్‌గా ఆయన్ను నియమిస్తుంది. కానీ కొన్ని కారణాల వల్ల ఆయన విద్యా సంస్థలో ఉద్యోగం మానేసి సొంతంగా కోచింగ్‌ సెంటర్‌ను ప్రారంభిస్తారు. ఆ తర్వాత ఆనంద్‌కుమార్‌ ఎలాంటి కష్టాలు పడ్డాడు..ఎలా విజయం సాదించారనేది చిత్ర కథ. నడియాద్‌వాలా గ్రాండ్‌సన్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌, ఫాంటమ్‌ ఫిల్మ్స్‌ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.