పూరి – ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ఇస్మార్ట్ శంకర్. రామ్ – నిధి అగర్వాల్ -నాభ నటేష్ జంటగా పూరి డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ చిత్రం చాల రఫ్ క్యారెక్టర్ లో కనిపించబోతున్నాడు. నిర్మాణ బాధ్యతలను దగ్గరుండి చూసుకుంటున్న ఛార్మి..ఎప్పటికప్పుడు సినిమా తాలూకా విశేషాలను అభిమానులతో సోషల్ మీడియా లో పంచుకుంటూ వెళ్తుంది.
తాజాగా ఛార్మీ ఒక ఆన్ లొకేషన్ స్టిల్ ను తన ట్విట్టర్ ఖాతా ద్వారా షేర్ చేసింది. ఈ ఫోటోతో పాటు “ఫోన్ కు డబల్ సిమ్ కార్డ్.. హీరోకు డబల్ దిమాక్. ఇస్మార్ట్ శంకర్ సెట్లో రామ్ తో.” అంటూ ట్వీట్ చేసింది. ఫోటోలో రామ్ ఛార్మీతో ఏదో సీరియస్ గా డిస్కస్ చేస్తున్నాడు. రీసెంట్ గా రిలీజ్ చేసి ప్రోమోస్ తో ‘ఇస్మార్ట్ శంకర్’ పై ఆసక్తిని పెరుగుతుంది. గత కొంతకాలంగా ఫామ్లో లేని రామ్ ..పూరి లు ఈ సినిమా తో ఫామ్ లోకి వస్తారా లేదా అనేది చూడాలి.
Phone ko double simcard
Hero ko double dimaak ?
On sets of #ismartshankar with my ismart @ramsayz ? #PCfilm @PuriConnects pic.twitter.com/jTIK2r8cq1— Charmme Kaur (@Charmmeofficial) 1 June 2019