కొరటాల – చిరు మూవీ డేట్ ఫిక్స్..

ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి సైరా నరసింహ రెడ్డి చిత్ర షూటింగ్ లో బిజీ గా ఉన్నాడు. ఈ మూవీ షూటింగ్ చివరి దశకు చేరుకోవడం తో నెక్స్ట్ మూవీ ఫై ఫోకస్ పెట్టారు. కొరటాల శివ డైరెక్షన్లో నెక్స్ట్ మూవీ తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. మొన్నటి వరకు ఎప్పుడు పూజా కార్య క్రమాలు మొదలు అవుతాయా..అని మెగా అభిమానులంతా ఎదురుచూస్తున్నారు. వారి ఎదురుచూపులు తెరపడినట్లే..మెగాస్టార్ పుట్టిన రోజైన ఆగష్టు 22 వ తేదీన కొరటాల సినిమా ప్రారంభం అవుతుందట.

రైతుల సమస్యలకు సంబంధించిన అంశంతో కథను రెడీ చేశారట శివ. ఇందులో మెగాస్టార్ డ్యూయెల్ రోల్ చేస్తున్నారు. ఒకటి రైతు పాత్రకాగా, రెండోది ఎన్ఆర్ఐ పాత్ర. రైతు పాత్ర చాలా పవర్ఫుల్ గా ఉండబోతున్నది. మరి ఈ సినిమా లో హీరోయిన్లు ఎవరు..మిగతా కాస్ట్ & క్రూ ఏంటి అనేది తెలియాల్సి ఉంది.