30 ఇయర్స్‌ పృధ్వీ రెచ్చిపోవడం ఖాయం..

’30 ఇయర్స్‌ ఇండస్ట్రీ’ ఇక్కడ అంటూ సినిమాల్లో తనదయిన స్టయిల్ లో నవ్వించిన పృధ్వీ ఇప్పుడు రాజకీయాల్లో ప్రత్యర్థి ఫై రెచ్చిపోవడం ఖాయమనిపిస్తుంది. ఇంతకాలం ఇండస్ట్రీ లో తన నటనతో ఆకట్టుకున్న ఈయన, ఇప్పుడు రాజకీయాల్లో ప్రజలకు మంచి చేసేందుకు సిద్దమయ్యాడు. కొన్ని రోజులు ముందు వైస్సార్సీపీ పార్టీ లో చేరిన సంగతి తెలిసిందే. వైఎస్‌ జగన్‌ ప్రజా సంకల్ప యాత్ర లో జగన్‌తో కలిసి పాదయాత్రలో కొంత దూరం నడిచాడు. పార్టీ లో చేరినప్పటి నుండి తెలుగుదేశం పార్టీ ఫై విరుచుక పడుతూనే ఉన్నాడు.

మొన్నటిదాకా తాను వైఎస్సార్సీపీ మనిషిననీ, అయితే ఆ పార్టీ తరఫున తాను ఎన్నికల్లో పోటీ చేయబోవడంలేదనీ చెప్పిన పృధ్వీ, 2019 ఎన్నికల్లో తనవంతు పాత్ర పోషించే అవకాశం ఇచ్చాడు జగన్. వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శిగా పృధ్వీకి అవకాశం కల్పిస్తూ వైఎస్‌ జగన్‌ నిర్ణయం తీసుకున్నాడు. ఇకపై పృధ్వీ తెలుగుదేశం ఫై పార్టీ ఫై రెచ్చిపోవడం ఖాయమంటున్నారు వైసీపీ నేతలు. మరి పృధ్వీ ఏ రేంజ్ లో టీడీపీ ఫై రెచ్చిపోతాడో చూడాలి.