వస్తుందో రాదో మరి
తెలంగాణ ఇప్పట్లో!
వణుకుతోంది స్టేటంతా
ఉద్వేగపు దుప్పట్లో!!
నెలరోజులు గడువుపెట్టి
వేడెక్కించెను షిండే!
తేడా వస్తే తప్పదు
కాంగీ నెత్తిన బండే!!
గోడమీది పిల్లిలాగ
జంపులొద్దు నాయకా!
పూటకొక్క పాటవద్దు
బహుళ గాత్ర గాయకా!!
రావణకాష్టం సెగలో
చలిని కాచుకోవద్దు!
భవిష్యత్తు రాజకీయ
చితిని పేర్చుకోవద్దు!!
– ఏవీయస్