డిష్యూం డిష్యూం అంటున్న అమలాపాల్

Amala paul doing fightsఅందాలు ఆరేయడం లోనే కాదు, అప్పుడప్పుడూ రౌడీ మూకను ఉతికి ఆరేయవలసిన పని కుడా పడుతోంది మన కధానాయికలకు. ‘రాణీ రుద్రమ’ కోసం అనుష్క కత్తి పట్టి పోరాటాలు చేస్తోంది. అందుకోసం ప్రత్యేకంగా శిక్షణ కూడా తీసుకుంటోంది. జేజమ్మ బాటలోనే ఇప్పుడు అమలాపాల్ కుడా నడుస్తోంది. అమల ‘నింజా’ అనే ఓ మార్షల్ ఆర్ట్ ని నేర్చుకొంది ‘ఇద్దరమ్మాయిలతో’ సినిమా కోసం. ప్రస్తుతం బ్యాంకాక్ లో చిత్రీకరణ జరుగుతోంది. అక్కడ నిపుణుల దగ్గర ఓ వారం రోజుల పాటు మెళకువలు నేర్చుకొంది. “ఈ సినిమాలో రఫ్ అండ్ టఫ్ అమ్మాయిగా కనిపిస్తున్నా. ఓ సందర్భంలో ఫైట్ కుడా చేయాలి. అందుకే పూరి సార్ నింజా నేర్చుకోమన్నారు. ఇదో గమ్మత్తైన అనుభవం” అని అమలా పాల్ చెబుతోంది.