క్షమించండి ప్లీజ్ : వినాయక్

vv-vinayak apologises Gandi Babjiఅభిమానుల మెగా ఆశల మధ్య రిలీజైన నాయక్ ఇప్పటికే ఆ చిత్రం పేరుపై నెలకొన్న వివాదాన్ని దాటేసింది. ఆ చిత్రంలో రాహుల్ దేవ్ పాత్రకు పెట్టిన పేరు “గండి బాబ్జీ”. ఇది ఓ మాజీ ఎమ్మెల్యే పేరు కావడంతో సదరు ఎమ్మెల్యే నుండి ఆ పేరును తొలగించాలంటూ అభ్యంతరాలు వెలువడ్డం తో మరో వివాదం చెలరేగింది. దీనిపై స్పందిస్తూ మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జికి దర్శకుడు వివి వినాయక్ క్షమాపణ చెప్పారు. రాంచరణ్ హీరోగా వినాయక్ దర్శకత్వం వహించిన ‘నాయక్’ చిత్రంలో ప్రతినాయకుడి పేరుకు తన పేరు పెట్టడంపై గండి బాబ్జి అభ్యంతరం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. దీనిపై ఆయన పెందుర్తి పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. విలన్ పాత్రకి పేరు యాదృచ్చికంగా పెట్టామే తప్ప ఉద్దేశపూర్వకంగా జరిగింది కాదని, గండి బాబ్జి మనస్తాపం చెందితే క్షమించాలని వినాయక్ కోరారు. అలాగే ఈ సినిమాలో అభ్యంతరకర సన్నివేశాలు సంభాషణలు తొలగిస్తామని హామీ ఇచ్చాడు.