పవన్ కళ్యాణ్ అంటే పడి చంచే అబిమానులు ఎంతమంది ఉన్నారు..కానీ ఆ అబిమనమే ఒకరి ప్రాణాలను బలిగొంది. తాజాగా ఈరోజు రిలీజ్ అయిన సర్దార్ ధియేటర్ దగ్గర ఓ అబిమాని ప్రాణాలు పోయాయి. వివరాల్లోకి వెళ్తే..
అనంతపురం జిల్లా మడకశిర సమీపంలోని కర్ణాటక రాష్ట్రం తుమకూరు జిల్లా పావగడలోని అలంకార్ థియేటర్‌లో పట్టణానికి చెందిన రాకేశ్ నాయక్ పవన్‌కల్యాణ్ సర్దార్ గబ్బర్‌సింగ్ సినిమా చూసేందుకు తన మిత్రులతో స్థానిక అలంకార్ థియేటర్‌కు వచ్చాడు. సినిమా చూస్తున్న సమయంలో హీరోని వేరే వర్గం వాళ్లు కామెంట్ చేయడంతో… రాకేశ్ స్నేహితులు వారితో గొడవపడ్డారు. దీంతో ఇరు వర్గాల వారు కత్తులతో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈ ఘర్షణలో రాశేక్ అక్కడికక్కడే చనిపోయాడు.