ఊరమాస్ ‘ఒంగోలుగిత్త’

Ongole-Gittaయువ కథానాయకుడు రామ్ విజయాన్వేషణలో ఉన్నారు. ఇప్పుడాయన ఖాతాలో అర్జెంటుగా ఓ హిట్ పడిపోవాలి. ఎందుకంటే ‘ఎందుకంటే ప్రేమంటే’ దారుణ పరాభవం రామ్ ని తీవ్రంగా కలచి వేసింది. మరోవైపు దర్శకుడు భాస్కర్  కూడా ‘ఆరెంజ్’ పరాజయాన్ని మర్చిపోవాలనుకుంటున్నారు. వీరిద్దరూ కలసి ‘ఒంగోలు గిత్త’ తో తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. ప్రేమ, కుటుంబ కథాచిత్రాలనే రూపొందించిన భాస్కర్… తొలిసారి యాక్షన్ నేపథ్యమున్న చిత్రానికి దర్శకత్వం వహించడం ఇదే తొలిసారి. “భాస్కర్ తో క్లాస్ సినిమా చేద్దామనుకొన్నా. కానీ ఊరమాస్ సినిమా తీశాం..” అని రామ్ చెబుతున్నారు. రామ్ ముందు నుంచీ ఈ సినిమాపై చాలా నమ్మకంగా ఉన్నారు. ఏప్రిల్, మే నెలల్లో మిర్చీ యార్డులో షూటింగ్ చేశారు. “ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాం. ఒక విధంగా చెప్పాలంటే ప్రాణాలు పెట్టి పనిచేశాం. దానికి తగిన ఫలితం రావాలి” అని రామ్ కోరుకొంటున్నారు. రామ్, భాస్కర్ ల ప్రయాణాన్ని ఈ సినిమా ఎటువైపుకు తీసుకెళ్తుందో చూడాలి.