ఆస్ట్రేలియా ఘోరపరాభవం

aus srilankఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో శ్రీలంక 4 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఆసీస్ నిర్దేశించిన 75 పరుగుల లక్ష్యాన్ని లంక ఆరు వికెట్లు కోల్పోయి 20 ఓవర్లలో చేరుకుంది. దిల్షాన్ 22, తిరిమానే 22, తరంగ 12 పరుగులు చేశారు. ఆసీస్ బౌలర్లలో జాన్సన్ 3, స్టార్క్ 2 వికెట్లు పడగొట్టారు. మెక్ కే ఒక వికెట్ తీశాడు.

అంతకు ముందు టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 26.4 ఓవర్లలో 74 పరుగులకే కుప్పకూలి రెండో తక్కువ స్కోర్ నమోదు చేసింది. స్టార్క్ (22), దొహెర్తీ(15) మాత్రమే రెండంకెల స్కోరు సాధించగలిగారు. లంక బౌలర్లలో కులశేఖర 5, మలింగ 3 వికెట్లు నేలకూల్చారు. మాథ్యూస్, ఇరంగ చెరో వికెట్ దక్కించుకున్నారు. కులశేఖర ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ దక్కించుకున్నాడు. ఈ విజయంలో 5 వన్డేల సిరీస్‌లో శ్రీలంక 2-1 ఆధిక్యం సాధించింది. ఇంతకు ముందు న్యూజిలాండ్ చేతిలో 70 పరుగులే అలౌటయిన విషయం తెలిసిందే.