మహేష్ సినిమా డౌటే!

Mahesh-Babu‘సారొచ్చారు’ సినిమాతో మరోసారి చేతులు కాల్చుకొంది వైజంతి మూవీస్. ఈ ప్రభావం మహేష్ బాబు సినిమా ‘శివం’పై పడే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అన్నీ కుదిరితే… ఈ ఫిబ్రవరిలో మహేష్ సినిమా పట్టాలెక్కేయాలి. అయితే… కొబ్బరికాయ కొట్టకముందే ఈ సినిమా ఆర్థిక సమస్యల్లో చిక్కుకొందని సమాచారం. అందుకే కాస్త వెనక్కి వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరో వైపు క్రిష్ ‘శివం’ స్ర్కిప్టు పనుల్లో తలమునకలై ఉన్నారు. మహేష్ ని మూడు పాత్రల్లో చూపించేందుకు సమాయత్తం అవుతున్నారు. అయితే దర్శకత్వ బాధ్యతలు చేతులు మారే ఛాన్స్ ఉందని తెలిసింది. అయితే ఈ ఊహాగానాల్ని చిత్రబృందం కొట్టిపారేస్తోంది. ఇప్పటికే మహేష్, సోనాక్షీ సిన్హాలకు అడ్వాన్స్ కూడా ముట్టజెప్పామని, ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ప్రాజెక్టు పట్టాలెక్కడం ఖాయమని చెబుతున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.