దొంగలను పట్టుకున్న మిస్టర్ నూకయ్య

manchu-manojసినిమాలో తనదైన స్టైల్ లో ఫైట్స్, ఫీట్స్ చేసే మనోజ్ నిజ జీవితం లో కూడా హీరోయిజం ప్రదర్శించాడు. తన చాకచక్యం తో ఇంట్లో పడ్డ దొంగలను పట్టుకున్నాడు. ఈ విషయాన్ని స్వయంగా తనే ట్విట్టర్ లో తెలుపుతూ…. ఇటీవల తమ ఇంట్లో పడిన దొంగలు … ఓ గదిలోకి ప్రవేశించారనీ, అది గమనించిన తాను ఆ దొంగలను పట్టుకుని బంధించానని, గంట కాలం పాటు దొంగలకు బ్రెయిన్ వాష్ చేసి వాళ్లను పోలీసులకు పట్టించానని అన్నాడు. అయితే ఆ దొంగలపై అంతకు ముందు ఎఫ్.ఐ.అర్ లేదని తెలిసి, చేసిన తప్పును సరిద్దిద్దుకునే అవకాశాన్ని కల్పిస్తూ వాళ్లను విడుదల చేయవలసిందిగా పోలీసులను కోరాడట ఈ యాక్షన్ హీరో.