రెహ్మాన్ నాకెప్పుడు కొత్తే : మణి రత్నం

ar rehman and maniratnamమణిరత్నం సినిమా అంటేనే… స్రీన్ పై సంగీత దర్శకుని పేరు ఏ.ఆర్‌. రెహమాన్‌ అని పడాల్సిందే. ఇళయరాజా తో సాగుతూ వచ్చిన మణిరత్నం మ్యూజిక్ జర్నీ… రెహ్మాన్ రాక తో సంగీతప్రపంచంలో ఓ నూతన అధ్యాయానానికి తెర లేపినట్టయింది. రోజా సినిమాతో మొదలైన వీరి జంట ప్రయాణం నేటి కడలి వరకు కొనసాగుతూనే ఉంది. దాదాపు 20 ఏళ్ళ వయసొచ్చిన వీరి మ్యూజిక్ జర్నీ లో ప్రతి ఆల్బం లో కొత్తదనం పాటు ఓ ఫ్రెష్ నెష్ వుంటుంది. ఇటీవల దర్శకుడు మణిరత్నం.. రెహ్మాన్ కాంబినేషన్ గూర్చి మాట్లాడుతూ… రెహ్మాన్ తనకు ఎప్పుడు కొత్త స్వర రుచులను పరిచయం చేస్తుంటాడు. రెహ్మాన్ ట్యూన్ చేసే స్టైల్ బాగుంటుంది. ఇన్నేళ్ళ కాలంలో రెహ్మాన్ తన స్కోరింగ్ తో ఎన్నో సర్ప్రైజెస్‌ ఇచ్చాడు. కడలి ఆల్బం లో కుడా నాకు ఓ సర్ప్రైజ్ వుంది. ఈ సినిమాలో ‘పచ్చని తోట’ సాంగ్ ట్యూన్ కట్టే సమయంలో నేను అతని వద్ద లేను. వచ్చిన తరువాత ఆ ట్యూన్ విని చాల థ్రిల్ ఫీలయ్యాను … నోట మాట రాలేదు’ అంటూ రెహ్మాన్ సంగీత ప్రతిభను వివరించాడు.