సంతకాలతో జనం కళ్ళు పొడుస్తారా : యనమల

yanamala-ramakrishnuduవైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్దోషి గా వైకాపా కోటి సంతకాల కార్యక్రమం చేపట్టి ఆ సంతకాల ప్రతులను రాష్ర్టపతి ప్రణబ్ ముఖర్జీకి అందించడం పట్ల ఇతర రాజకీయ పార్టీలను నుండి తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోంది. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు యనమల రామకృష్ణుడు మాట్లాడుతూ.. జగన్ నిర్ధోషిగా కోటి 96 లక్షల మంది సంతకాలు చేశారని, వైకాపా నేతలు చెబుతున్నారు… సంతకాలు చేయలేదు కాబట్టి రాష్ర్టంలో మిగిలిన 6 కోట్ల 65లక్షల మంది జగన్ ముద్దాయిగా అంగీకరించినట్లు ఒప్పుకుంటారా..? అని సవాల్ విసిరారు.

జగన్ అక్రమాస్తుల కేసులు అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు ముందు ఉన్నాయి. దర్యాప్తులో భాగంగా సీబీఐ 4 ఛార్జీషీట్లు దాఖలు చేయడంతో పాటు జగన్ ను అరెస్ట్ చేసి జైలుకు పంపింది. అక్రమాస్తులను కూడా దశలవారిగా జప్తు చేస్తుంది. ఈ దశలో న్యాయ వ్యవస్థలో జోక్యం చేసుకోవలసిందిగా భారత రాష్ర్టపతిని కోరడం అవాంఛనీయమని, రాజ్యాంగ స్ఫూర్తికే విఘూతం అని యనమల దుయ్యబట్టారు. నీచరాజకీయాలకు చిరునామాగా వైకాపా వ్యవహరిస్తుందిని ఆయన పేర్కొన్నారు. వేల కోట్ల అక్రమాస్తులను దోచుకొని.. ఇప్పుడు సంతకాలతో జనం కళ్ళు పొడుస్తారా… అని ఆయన విమర్శించారు.