తడాఖా చూపిద్దాం..

తలలునరికి తనేమిటో
చెప్పిందోయ్ పాకిస్తాన్ !
రాక్షస సంతతి చేష్టలు
కళ్ళముందు ఖబరిస్థాన్ !!

నిరంతరం కవ్వింపులు
గతిమారని ఆ దేశం !
ప్రపంచానికిస్తోందీ
జన నెత్తుటి సందేశం !!

భారత సరిహద్దుల్లో
హద్దులుదాటిన వైనం !
ఎంత రెచ్చగోడుతున్నా
వీడని భారత సహనం !!

ఉగ్రవాద దేశాలకు
ఉప్పు పాతరెయ్యాలి !
పైశాచిక శక్తులనిక
నిలువున ఉరితియ్యాలి !!

– ఏవీయస్