సీతమ్మతో దిల్‌ నిండా ఆనందం

SVSC-dilrajuరెండు దశాబ్ధాల తర్వాత తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన మల్టీ స్టారర్‌ “సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు”. భారీ అంచనాల మధ్య విడుదలయి దాదాపుగా అందరి అంచనాలకు ఏ మాత్రం తీసిపోని విధంగా మెప్పించింది ఈ సీతమ్మ. ‘‘నిర్మాతగా నాకెంతో సంతృప్తినిచ్చిన సినిమా ‘సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు’. తొలిరోజు నుంచే కుటుంబ ప్రేక్షకుల ఆదరణ ఈ సినిమాకు లభించడం ఆనందంగా ఉంది’’ అని నిర్మాత దిల్ రాజు తన ఆనందాన్ని పంచుకున్నారు. వెంకటేష్, మహేష్ హీరోలుగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించిన ‘సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు’ చిత్రం శుక్రవారం విడుదలై సంచలన విజయం దిశగా ప్రయాణిస్తోంది. ఈ సందర్భంగా దిల్‌రాజు విలేకరులతో మాట్లాడారు. ‘‘ఈ సినిమాకు లభిస్తున్న ప్రశంసలు మరిచిపోలేనివి. ఈ క్రెడిట్ మొత్తం వెంకటేష్, మహేష్‌లదే. వారిచ్చిన సహకారం వల్లే సినిమాను దిగ్విజయంగా పూర్తి చేయగలిగాం. పరుగు, కొత్త బంగారులోకం చిత్రాలకు కూడా తొలుత కాస్త డివైడ్‌టాక్ వచ్చింది. తర్వాత ఆ సినిమాలు ఎంతటి విజయాలను నమోదు చేశాయో తెలిసిందే. ఈ సినిమా కూడా అదే దారిలో పయనించి మా సంస్థలో బ్లాక్‌బాస్టర్‌గా నిలుస్తుందని నమ్మకంగా చెప్పగలను. చాలా రోజుల తర్వాత థియేటర్ల నిండా కుటుంబ ప్రేక్షకులు కనిపిస్తున్నారు. చాలామంది సినిమా చూసి భావోద్వేగానికి గురవు తున్నారు. ’’ అని తెలిపారు దిల్ రాజు.