రైల్లో మానవ అస్థిపంజరాలను తరలిస్తూ బిహార్‌లోని చాప్రా రైల్వే స్టేషన్‌లో సంజయ్ ప్రసాద్ అనే వ్యక్తి పట్టుబడడం కలకలం రేపింది. అతడు దాదాపుగా 50 అస్థిపంజరాలను తరలిస్తున్నడని సమాచారం. బీహార్‌లోని చాప్ర రైల్వే స్టేషన్‌లో బలియా – సియాల్దహ్ ఎక్స్‌ప్రెస్‌లో మంగళవారం 16 మానవ పుర్రెలు, 34 అస్తిపంజరాలు బయట పడ్డాయి . ఈ కేసులో తూర్పు చంపారన్ జిల్లాకు చెందిన సంజయ్ ప్రసాద్ అనే నిందితుడిని గవర్నమెంట్ రైల్వే పోలీస్ (జీఆర్పీ) బృందం అరెస్ట్ చేసినట్టు రైల్వే డిప్యూటీ ఎస్పీ తన్వీర్ అహ్మెద్ వెల్లడించారు.
ఉత్తర్ ప్రదేశ్‌లోని బల్లియా నుంచి తాను ఈ పుర్రెలు, అస్తిపంజరాలు కొనుగోలు చేశానని, ప్రస్తుతం వీటిని తీసుకుని పశ్చిమ బెంగాల్ మీదుగా భూటాన్ వెళ్లబోతున్నానని సంజయ్ ప్రసాద్ తమ విచారణలో అంగీకరించినట్టు తన్వీర్ అహ్మెద్ చెప్పారు.
అతడి వద్ద నుంచి నేపాల్, భూటాన్ కరెన్సీలను, పలు ఏటీఎం కార్డులను, రెండు గుర్తింపు కార్డులను, సిమ్ కార్డులను, నేపాల్ మొబైల్ ఫోన్ నంబర్లను స్వాధీనం చేసుకుంటే , అతడి గుర్తింపు కార్డులలో ఓ అడ్రస్ పశ్చిమ్‌బంగాలోని వెస్ట్ చంపారన్ అని ఉందని, మరో గుర్తింపు కార్డులో పశ్చిమ్‌బంగాలోని న్యూ జల్‌పైగురి అని ఉందని తెలిపారు.