హాకీ వరల్డ్ కప్ ఏర్పాట్లు ఒడిశాలో రంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. 19 రోజుల పాటు జరిగే ఈ వరల్డ్ కప్ పోటీలు.. రాజధాని భువనేశ్వర్‌లోని కళింగ స్టేడియంలో జరగనున్నాయి. ఈ వరల్డ్ కప్ పోటీల్లో ప్రదర్శనలు ఇవ్వడానికి సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఎ. ఆర్. రెహ్మాన్, మాధురీ దీక్షిత్ లు వస్తున్నారు.
ఇప్పటికి 13 సార్లు ఈ వరల్డ్ కప్ నిర్వహించగా.. 1973లో ఫైనల్స్ వరకూ వెళ్లినా భారత్.. నెదర్లాండ్స్ చేతిలో ఓడిపోవడంతో రన్నరప్‌తో స్థిరపడాల్సి వచ్చింది. ఆ తరువాత 1975లో కౌలాలంపూర్ వేదికగా జరిగిన ప్రపంచ కప్‌లో మాత్రమే భారత్ కప్ గెలుచుకుంది. పాకిస్తాన్‌ని 2–1 తేడాతో ఓడించి కప్ సొంతం చేసుకుంది. హాకీ వరల్డ్ కప్‌కి భారత్ ఆతిధ్యం ఇవ్వడం ఇది మూడవ సారి. తొలిసారిగా 1962లో ముంబయిలో భారత్ ఆతిధ్యం ఇవ్వగా.. రెండవ సారి 2010లో న్యూఢిల్లీ అందుకు వేదికైంది.
పూల్ ఏలో భాగంగా ఈ పోటీల్లో అర్జెంటీనా, న్యూజిలాండ్, స్పెయిన్, ఫ్రాన్స్…. పూల్ బీలో భాగంగా ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, ఐర్లాండ్, చైనా…. పూల్ సీలో భాగంగా బెల్జియం, భారత్, కెనడా, దక్షిణాఫ్రికా…. పూల్ డీలో భాగంగా నెదర్లాండ్స్, జర్మనీ, మలేషియా, పాకిస్థాన్ జట్లు తలపడునున్నాయి. ఈ వరల్డ్ కప్ పోటీలు ప్రారంభమవుతున్న క్రమంలో విద్యాసంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం సెలవు ఇచ్చింది.
Hockey and culture have ties that bind and in Odisha, it will be on a grand display as Bollywood icons @iamsrk and @MadhuriDixit join the legendary @arrahman on stage for the #HWCOpeningCeremony.#HWC2018 #Odisha2018 @TheHockeyIndia @FIH_Hockey pic.twitter.com/a2EJOukkaG
— Hockey World Cup 2018 – Host Partner (@sports_odisha) November 27, 2018