తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో టీడీపీ తన మేనిఫెస్టోను విడుదల చేసింది. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ వేదికగా టి.టీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ చేతుల మీదుగా మేనిఫెస్టో రిలీజ్ చేశారు. జనాల సమస్యలను దృష్టిలో పెట్టుకొని టీడీపీ తమ మేనిఫెస్టోలో అమరవీరుల కుటుంబాలు, నిరుద్యోగులకు పెద్దపీట వేసినట్లు తెలుస్తుంది.
ఈ సందర్భంగా రమణ మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజల సంక్షేమాన్ని దృష్టిలోపెట్టుకొని మేనిఫెస్టో రూపకల్పన చేశామన్నారు. ఆర్ధికంగా బలంగా ఉన్నతెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ అప్పుల పాలు చేశారని విమర్శించారు. ఈ సందర్భంగా రావుల చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ టీఆర్ఎస్ పాలనతో అన్ని వర్గాలు ప్రజలు అసంతృప్తితో ఉన్నారని విమర్శించారు. పేదల సంక్షేమానికి కృషి చేసిన నాయకుడు ఎన్టీఆర్ అని రావుల అన్నారు. ముస్లింలు, సామాన్యలు, పేదలకు పింఛను ఇచ్చిన తొలి వ్యక్తి ఎన్టీఆర్ అని కొనియాడారు.
మేనిఫెస్టో వివరాలు:
* అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదే లక్ష ఉద్యోగాలు భర్తీ
* అమలవీరుల కుటంబాలకు ఇంటికో ఉద్యోగం
* ప్రగతి భవన్ ప్రజా ఆస్పత్రిగా మార్పు
* తెలంగాణ అమరవీరుల శాశ్వతి స్మృతి చిహ్నం
* 58 ఏళ్ల దాటిన వారికి ప్రతి నెల రూ.2 వేల పించన్
* వికలాంగులకు రూ.3 వేల ఫించను
* ప్రభుత్వ ఉద్యోగులకు ఇళ్ల స్థలాలు
* బీసీలకు ప్రత్యేక సబ్ ప్లాన్
* 8 నుంచి 10 టెన్త చదివే బాలికలకు ఉచిత సైకిళ్లు