హైదరాబాద్ కు అక్బరుద్దీన్?

Akbaruddin-Owaisi-Arrest1వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసిని హైదరాబాద్ కు తీసుకురావడాని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తొంది. అదిలాబాద్ నిర్మల్ సభలో వివాదస్పద వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఓయూ పోలీస్ స్టేషన్లో కూడా ఆయనపై కేసు నమోదైన విషయం తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి అక్బరుద్దీన్ ఓయూ పీఎస్ లో శుక్రవారం హాజరు కావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఆయనను హైదరాబాద్ తీసుకొచ్చేందుకు ఓయూ పోలీసులు సన్నాహాలు చేస్తున్నారు. పీటీ వారెంట్పై అక్బరుద్దీన్ ను తీసుకొచ్చే అంశంపై న్యాయ నిపుణులతో ఓయూ పోలీసులు చర్చిస్తున్నారని సమాచారం. ప్రస్తుతం అక్బరుద్దీన్ ఆదిలాబాద్ జిల్లా జైలులో ఉన్న విషయం తెలిసిందే.