ప్రభాస్‌ సోదరుడిగా రానా

prabhas-rana-సినీజక్కన్న తన చిత్రం కోసం పాత్రల్ని చెక్కడంలో బిజీగా ఉన్నాడు. రాజమౌళి ప్రభాస్‌ తో తెరకెక్కించబోతున్న తాజా చిత్రం ప్రీ ప్రొడక్షన్‌ వర్క్‌ లో బిజీ అయిపోయాడు. తన పాత్రల విషయంలో ఎంత ఆచితూచి వ్యవహరిస్తాడో మనందరికీ తెలిసిన విషయమే. ఎన్నో రోజుల నుండీ గాసిప్‌ లా చక్కర్లు కొడుతున్న ఓ వార్తను నిజం చేశేశాడు. ఈ సినిమాలో రానా విలన్‌ అని చాలా రోజుల నుండి వినవచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తాజాగా రాజామౌళి ఈ చిత్రంలో రానా నటిస్తున్నాడని నిర్ధారించేశాడు. ప్రభాస్‌, రానా సోదరులుగా నటిస్తారని, ఇద్దరి ఫిజిక్‌ లు దగ్గరగా ఉండడంతో నెగెటివ్‌ పోకడలతో సాగే ప్రభాస్‌ సోదరుడిగా రానాను ఎంపిక చేశామని రాజమౌళి చెప్పినట్టు తెలిసింది. ఏదేమైనా తన సినిమాల్లో మామూలుగా హీరో పాత్ర కంటే విలన్‌ పాత్రకే ప్రాముఖ్యత ఎక్కువగా చూపిస్తాడు మౌళి. కనీసం ఈ దెబ్బతో నయినా రానా దశ తిరుగుతుందేమో చూడాలి.