బస్సుల్లో, రైళ్లలో, విమాన ప్రయాణాల్లో కొంతమంది కిటికీ పక్కన సీట్లలో కూర్చోవడానికి బాగా ఇష్టపడతారు. దొరకకపోతే అడిగి మరీ విండో సీట్లో కూర్చునేందుకు ప్రయత్నిస్తుంటారు. ఎర్రబస్సులోనే కాదు విమానంలో కూడా విండో సీటు కోసం ప్రయాణికులు ఆరాటపడతారు అనడానికి ఈఘటనే ఉదాహరణ. ఓ ప్రయాణికుడికి విమానంలో విండో సీటు దొరకలేదు. దీంతో తనకు విండో సీటు కావాలంటూ విమాన సిబ్బందిని తెగ ఇబ్బంది పెట్టాడు.
జపాన్ నుంచి వెళ్తున్న ఓ విమానంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అసలు ఏం జరిగిందంటే ఓ వ్యక్తి తాను కిటికీ పక్కనే కూర్చుంటానని, సీటు మార్చాలని సిబ్బందిని అడిగాడు. అలా సీట్లు ఏమీ అందుబాటులో లేవని ఆమె ఎంత చెప్పినా వినిపించుకోకుండా అడుగుతూనే ఉన్నాడు. పదే పదే ఆమెను విండో సీటు కోసం విసిగిస్తుండటంతో ఏం చేయాలో తెలియక, ఓ పేపర్‌పై విండో సీటును గీసి, అతడి సీటు పక్కన అతికించింది ఆ హోస్టెస్. అంతే.. వెంటనే మనోడు నోరు మూసుకున్నాడట. అప్పటి నుంచి విమానం దిగేదాకా కిక్కుమనలేదట మనోడు.
ఆ ఫొటోను ఓ నెటిజన్ ట్విటర్లో పోస్ట్ చేశారు. ఈ ఫొటో సోషల్‌మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఇప్పటికే 15వేలకు పైగా లైక్స్, 8వేలకు పైగా రీట్వీట్లు చేశారు. విమాన సిబ్బంది చూపించిన పరిష్కారం అద్భుతంగా ఉందని, చాలా సరదాగా ఉందని, ఆమె చాలా తెలివిగా స్పందించారని రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు.
窓が無い座席だったので隣のお兄さんがCAさんにクレームをつけたら、上空の景色書いて貼り付けてくれたwww pic.twitter.com/FJv6kJnwnD
— こぉ↑すけ@しおりおし (@kooo_TmS_suke) November 5, 2018