జగన్ కు ఈడీ మరో ఝలక్

3rd-ED-attachment-of-Jagan-benami-wealth-Many-more-in-offingజగన్ అక్రమాస్తుల కేసుల కేసు కీలక మలుపు తిరిగింది. మంగళవారం ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) 143.74 కోట్ల రూపాయల విలువైన స్థర, చర ఆస్తులను జప్తు చేసింది. ఈ కేసులో ఇది రెండో జప్తు. గతంలో జగతి, జనని ఇన్ ఫ్రా కంపెనీలకు చెందిన రూ. 51 కోట్లు, రూ. 71 కోట్ల విలువైన ఆస్తుల్ని వేర్వేరు ఉత్తర్వుల్లో జప్తు చేసింది.

నల్లధనం అక్రమ చలామణి చట్టంలోని 5(1) నిబంధన కింద మంగళవారం అటాచ్ అయిన ఆస్తుల్లో రాంకీ ఫార్మాసిటీ (ఇండియా) లిమిటెడ్ కు చెందిన దాదాపు 135.46 ఎకరాల భూమి, రూ.3.20కోట్ల మ్యూచువల్ ఫండ్ డిపాజిట్, జగతి పబ్లికేషన్స్ కు  చెందిన రూ.10కోట్ల ఫిక్స్డ్ డిపాజిట్లు ఉన్నాయి. మూడింతి ఉమ్మడి విలువ రూ. 143.74 కోట్లని నిర్ణయించారు. జగన్ అక్రమాస్తుల కేసులో సీబీఐ కోర్టుకు సమర్పించిన రెండో చార్జిషీట్ ఆధారంగానే ఈ చర్యలు తీసుకున్నారు.

సీబీఐ జగన్ మీద, మరో ౭౩ మంది సహనిందితులు మీద నమోదు చేసిన ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ప్రాథమిక దర్యాప్తు నివేదిక ఆధారంగా ఈడీ దర్యాప్తు కొనసాగుతోంది. ఇందులో కొందరు గుర్తుతెలియని వ్యక్తులు, గుర్తు తెలియని సంస్థలు ఉన్నట్లు తెలిపారు.