“సీతమ్మ…”కు క్లీన్ యూ

Seethamma-Vakitlo-Sirimalle-Chettu-New-Wallpaperవిక్టరీ వెంకటేష్, మహేష్ అన్నదమ్ములుగా దిల్ రాజు నిర్మించిన “సీతమ్మ వాకిట్లో..” చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తిచేసుకొని క్లీన్ యూ సర్టిఫికెట్ పొందింది. సంక్రాంతి కానుకగా ప్రపంచ వ్యాప్తంగా జనవరి 11న విడుదలకాబోతున్న సందర్భంగా నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ.. ఈ సినిమాకి ఒక్క కట్ కూడా లేకుండా క్లీన్ యూ సర్టిఫికెట్ ఇచ్చారనీ, ఈ మధ్యకాలంలో ఇలాంటి ఓ మంచి ఫ్యామిలీ ఎంటర్ టైనర్ తీసినందుకు సెన్సార్ వారు కూడా అభినందించారని తెలియజేశారు.

దాదాపు 25 ఏళ్ళ తరవాత వస్తున్న ఈ మల్టీస్టారర్ తమ బ్యానర్ 10 సంవత్సరాలు పూర్తిచేసుకున్న సందర్భంగా రిలీజ్ అవడం సంతోషంగా ఉందని తెలియజేశారు దిల్ రాజు. సినిమా ఇంత బాగా రావడానికి ఎంతగానో సహకరించిన హీరోలు వెంకటేష్, మహేష్ లకు ఈ సందర్భంగా దిల్ రాజు కృతజ్ఞతలు తెలియజేశారు.

విక్టరీ వెంకటేష్ మాట్లాడుతూ.. కుటుంబ సమేతంగా చూసి ఎంజాయ్ చేసే విధంగా “సీతమ్మ..” ఉంటుందని అలాగే మహేష్ తో కలసి నటించడం చాలా హ్యాపీగా ఉందని చెప్పారు. మరో హీరో మహేష్ మాట్లాడుతూ.. దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల చెప్పిన సబ్జెక్ట్ విని చాలా ఇన్ స్పైర్ అయ్యాననీ, ఈ సినిమా తనకో మంచి అనుభూతిని, సంతృప్తిని ఇచ్చిందని వెంకటేష్ గారితో తెరపంచుకోవడం ఆనందంగా ఉందని తెలియజేశారు.