ఇది ప్రభాస్ సత్తా అంటే..

బాహుబలి సినిమా తో యంగ్ రెబల్ స్టార్ అల్ ఇండియా స్టార్ అయిపోయాడు..భాష రాని వారు సైతం ప్రభాస్ వీరాభిమానులు గా చెపుతున్నారు. ప్రస్తుతం ప్రభాస్ సాహో తో పాటు తన 20 వ సినిమా చేస్తున్నాడు. అక్టోబర్ 23 న ప్రభాస్ పుట్టిన రోజు సందర్బంగా సాహో యూనిట్ షేడ్స్ ఆఫ్ సాహో చాప్టర్ 1 పేరుతో మేకింగ్ వీడియోను రిలీజ్ చేసారు. ఈ వీడియో విడుదల అయ్యిందో లేదో దానిని టాప్ వన్ గా చేర్చారు. హాలీవుడ్ స్థాయిలో మేకింగ్ ఉండడం తో సినిమా ఫై ఇంకాస్త ఆసక్తి పెరిగింది.

సినిమాలో భారీ యాక్షన్ సన్నివేశాలను తెరకెక్కించిన విధానాన్ని విజువల్స్ తో వివరిస్తూ ఆఖరున ప్రభాస్ ఎలివేషన్ షాట్ ఒకటి పెట్టడంతో అభిమానులకు , సినీప్రేక్షకులకు ఈ వీడియో విపరీతంగా నచ్చింది. దీంతో 24 గంటల్లో ఈ మేకింగ్ వీడియో కు 10 మిలియన్లకు పైగా వ్యూస్ సొంతం చేసుకుని రికార్డ్ నెలకొల్పింది. మేకింగ్ వీడియోకే రేంజ్ వ్యూస్ వస్తే ఫస్ట్ లుక్ టీజర్ కు ఇంకెన్ని వ్యూస్ రావాలో అంటూ లెక్కలు వేసుకుంటున్నారు.

సుజీత్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను యువీ క్రియేషన్స్ బ్యానర్ నిర్మిస్తోంది. ప్రభాస్ కు జోడిగా బాలీవుడ్ బ్యూటీ శ్రద్దా కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది.