ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో మనం బయట తినడానికి ఎక్కువగా ఇష్టపడుతున్నాం. కానీ బయట తినే బిర్యానీ ఏ మాంసంతో చేస్తున్నారో తెలియకుండా తినేస్తున్నాము. చికెన్ బిర్యానీ అయితే నిల్వ ఉంచిన చికెన్ తో చేస్తున్నారు కొన్ని రెస్టారెంట్ వాళ్ళు. అదే మేక మాంసం బిర్యానీ అయితే మేక మాంసం బదులు ఒంటె లేదా గొడ్డు మాంసం తో వడ్డించేస్తున్నారు. ఇప్పుడు అలాంటిదే మన హైదరాబాద్ లో స్పైస్ 6 ది అరబ్ వీలేజియో రెస్టారెంట్ లో జరిగింది.
వివరాల్లోకి వెళితే కూకట్పల్లి శంషీగూడ ప్రాంతంలో నివాసం ఉంటున్న డా.కేవీ సురేష్‌కుమార్ అనే వైద్యుడు తన స్నేహితులైన ఐపీసీ అధికారి శ్యామ్‌సుందర్, ఐఆర్ఎస్ అధికారి విజయ్‌కుమార్, ఏపీ రాష్ర్టానికి చెందిన ఎక్సైజ్ అసిస్టెంట్ కమిషనర్ సుర్జీత్‌సింగ్, నరేశ్‌లతో కలిసి ఈ నెలలో భోజనం చేసేందుకు బంజారాహిల్స్ రోడ్డు నెంబరు 12లోగల స్పైస్ 6 ది అరబ్ వీలేజియో రెస్టారెంట్‌కు వెళ్లారు. అక్కడ ఉమ్ అలీ లహం(మటన్) అర్డర్ చేశారు.
అదీ తిన్న తర్వాత వారికి అనుమానం వచ్చింది. ఈ వంటకాన్ని బీఫ్‌తో తయారు చేశారని, రెస్టారెంట్ నిర్వాహకులను మటన్ వడ్డించినట్టు రాసివ్వాలని ప్రశ్నించగా సరైన సమాధానం ఇవ్వలేదు. దాంతో తిన్న పదార్థాలకు శాంపిల్స్ తీసుకుని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో, నిర్వాహకులపై 420, 272, 273 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.