ఫ్యూజు మాడిపోతుంది….

పెంచండోయ్ చార్జీలను
మీ ఇష్టం వచ్చినట్టు !
కడతాళ్ళే సామాన్యుడు
ఈ బిల్లులు చచ్చినట్టు !!

రాష్ట్రంలో వున్న జనం
బతకాలా..చావాలా ..!
ప్రజలను కాపాడేందుకు
దేవుడు దిగిరావాలా !!

ఇవ్వoడోయ్ లాంతర్లను
ఆదార్ కార్డుల మీద !
సర్కారీ అసమర్ధత
ప్రోగ్రెస్ బోర్డుల మీద !!

మానవత్వమే లేదా
ఎన్నిసార్లు పెంచుతారు !
కడుపురగిలి సగటు జనం
మిమ్మల్నెలా ఉంచుతారు !!

– ఏవీయస్