‘బిగ్ బి’ పుట్టిన రోజుకు సైరా అదిరిపోయే గిఫ్ట్…

బాలీవుడ్ లెజెండ్ యాక్టర్ బిగ్ బి అమితాబ్ బచ్చన్..ఇప్పటికే ఎన్నో వైవిధ్యమైన పాత్రలు పోషించి ప్రేక్షకులను అలరించారు. ఇప్పుడు మొదటిసారి తెలుగులో ఇప్పటివరకు చేయనటువంటి పాత్రలో కనిపించబోతున్నారు. మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్ర పోషిస్తున్న సైరా నరసింహ రెడ్డి చిత్రం లో బిగ్ బి ఓ ప్రత్యేకమైన రోల్ లో కనిపించబోతున్నాడు. ఇప్పటికే ఈయనకు సంబందించిన కొన్ని సన్నివేశాలను షూట్ చేయడం జరిగింది.

ఇక అక్టోబర్ 11 న ఈయన పుట్టినరోజు జరుపుకోబోతున్నారు. ఈ సందర్భాంగా చిత్ర యూనిట్ సైరా లోని ఆయన పాత్ర తాలూకా ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేస్తున్నట్లు సమాచారం. గతంలో బిగ్ బి ఈ సినిమాలోని తన రోల్ పిక్స్ ను పోస్ట్ చేసి ఆకట్టుకున్నాడు. ఇక ఇప్పుడు అసలు సిసలైన ఫస్ట్ లుక్ విడుదల కాబోతుండడం తో ఆ లుక్ లో ఇంకెలా కనిపించబోతున్నాడో అని అభిమానులు , మెగా ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

సురేందర్ రెడ్డి డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం జార్జియా దేశంలో గత కొన్ని రోజులుగా జరుగుతుంది. ఈ షెడ్యూల్లో హాలీవుడ్ స్టంట్ మాస్టర్ ల ఆధ్వర్యంలో సుమారు 500 మంది ఫై ఈ పోరాట సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. తాజాగా ఈ షెడ్యూల్ లో ప్రముఖ సీనియర్ నటుడు జగపతి బాబు అలాగే తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి లు పాల్గొన్నారు.

స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నర్సింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా ఈ సినిమాను భారీ బడ్జెట్ తో మెగా పవర్ రామ్ చరణ్ నిర్మిస్తున్నాడు.