తెరపైకి సానియా మీర్జా బయోపిక్..హీరోయిన్ ఎవరో తెలుసా..?

ప్రస్తుతం చలన చిత్ర పరిశ్రమలో బయోపిక్ లు ఎక్కువయ్యాయి..సినీ , రాజకీయ నేతల చిత్రాలే కాకుండా క్రీడాకారుల కు సంబదించిన జీవిత కథలను కూడా తెరకెక్కించేందుకు ఉత్సహపడుతున్నారు. ఇప్పటికే మేరీకోమ్ , సచిన్ , ధోని బయోపిక్ లు వచ్చి బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించాయి. దీంతో మరికొంతమంది బయోపిక్ లను తెరకెక్కించేందుకు ముందుకు వస్తున్నారు. ఇటీవలే బ్యాడ్మింటన్ క్వీన్ సైనా నెహ్వాల్ బయోపిక్ మొదలు అయ్యింది. ఈ బయోపిక్ లో సైనా పాత్రలో శ్రద్ధా కపూర్ నటిస్తుంది. ఇదిలా ఉండగానే తాజాగా హైదరాబాదీ టెన్నిస్ స్టార్ సానియా మీర్జా – క్రికెటర్ మిథాలీ రాజ్ బయోపిక్ లు తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.

సానియా బయోపిక్ లో నటించేందుకు జిగేల్ రాణి పూజా హెగ్డే ఆసక్తి చూపిస్తుందట. ఇటీవలే ఓ చిట్ చాట్ లో పూజా మాట్లాడుతూ-“సానియా – మిథాలీ రాజ్ బయోపిక్ లు తీస్తే నటించాలన్న ఆసక్తి ఉంది“ అని చెప్పుకొచ్చింది. పూజా చెప్పిందంటే ఆమె వరకు ఈ కథ వెళ్లే ఉంటుంది..అందుకే నటించాలని ఉందని చెప్పకనే చెప్పింది.

ప్రస్తుతం పూజా వరుస తెలుగు సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది. ఎన్టీఆర్ సరసన అరవింద సమేత , మహేష్ సరసన మహర్షి సినిమాల్లో హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే ప్రభాస్- జిల్ రాధాకృష్ణ కాంబినేషన్లో రాబోతున్నఓ సినిమాలోనూ ఈమెకు హీరోయిన్ ఛాన్స్ వచ్చినట్లు సమాచారం. మొత్తం మీద ఇటు గ్లామర్ పాత్రలఫై దృష్టి పెడుతూ మరోపక్క బయోపిక్ లపై ఇంట్రస్ట్ చూపిస్తుంది పూజా.