బాలీవుడ్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన చిత్రం థగ్స్ ఆఫ్ హిందుస్థాన్ కోసం ప్రేక్షకులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. విజయ్ కృష్ణ ఆచార్య దర్శకత్వంలో బాలీవుడ్ దిగ్గజాలు అమితాబ్ బచ్చన్, ఆమిర్ ఖాన్ ప్రధాన పాత్రల్లో మరియు లాయిడ్ ఒవెన్ ప్రతినాయకుడి పాత్రలో అలాగే కత్రినా కైఫ్, ఫాతిమా సనా షేక్ కథానాయికలుగా నటిస్తున్నారు.
ఇప్పటికే అమితాబ్ కమాండర్ ఖుదాబక్ష్ పాత్రలో, ఫాతిమా జఫీరా పాత్రలో, లాయిడ్ ఒవెన్ ఈస్ట్ ఇండియా కంపెనీ కమాండర్ లార్డ్ జాన్ క్లైవ్ పాత్రల్లో ఉన్న లుక్ లను విడుదల చేసారు. తాజాగా కత్రినా లుక్ విడుదల చేశారు. సురైయ్యా పాత్రలో కత్రినా అదరగొడుతుంది. 300 కోట్ల రూపాయలతో నిర్మిస్తున్న ఈ సినిమాను ఆదిత్య చోప్రా, ఆమిర్‌ఖాన్ నిర్మిస్తున్నారు. 1839లో వచ్చిన ‘కన్ఫెషన్స్ ఆఫ్ థగ్’ నవల ఆధారంగా భారీ పీరియాడికల్ చిత్రంగా తెరకెక్కిన ఈ సినిమాను దీపావళి కానుకగా నవంబరు 8న విడుదల చేస్తున్నారు.
సురైయ్యా లుక్‌లో కత్రినా అందం చూపు తిప్పుకోలేని విధంగా ఉంది. ఎరుపు, పచ్చ రంగు కాంబినేషన్లో ఉన్న లెహెంగాలో, చేతికి గోరింటాకు, ముక్కు పుడక, నల్లటి బొట్టు, పట్టుకుచ్చులాంటి జుట్టుతో కత్రినా సలామ్ కొడుతున్న పోస్టర్‌కు అభిమానులు ఫిదా అయిపోయారు.