పెట్రోల్, డీజిల్‌లపై లీటర్‌కు రూ.2 తగ్గించిన సీఎం


రోజు రోజుకు పెరుగుతున్న పెట్రోల్ ధరలు పెరుగుతూనే ఉన్నాయి. సామాన్యలు ఇబ్బంది పడుతున్నాగాని కేంద్రప్రభుత్వం మాత్రం పెరుగుతున్న రేట్లు గురించి ఏదో వంక చెప్పి తప్పించుకుంటుంది. అయితే ఈ మధ్య రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం తమ ప్రజలు ఇబ్బంది పడకూడదని, ప్రభుత్వానికి వచ్చే వ్యాట్ ను తగ్గిస్తున్నాయి. ఇప్పటికే ఏపీ, రాజస్థాన్, వెస్ట్ బెంగాల్ రాష్ట్రాలు పెట్రో ధరలను తగ్గించగా, ఇప్పుడు నాలుగో రాష్ట్రంగా కర్ణాటక కూడా చేరి పోయింది.

కర్ణాటక ప్రభుత్వం పెరిగిపోతున్న పెట్రో ధరల భారం నుంచి ప్రజలకు కాస్త ఉపశమనం కలిగించే నిర్ణయం తీసుకుంది . పెట్రోల్, డీజిల్‌లపై లీటర్‌కు రూ.2 తగ్గించింది. ప్రస్తుతం బెంగళూరులో పెట్రోల్ ధర రూ.84.59గా ఉండగా.. డీజిల్ ధర రూ.76.10గా ఉంది. దీంతో లీటర్‌కు రూ.2 తగ్గించాలని తమ సంకీర్ణ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు సీఎం కుమారస్వామి ప్రకటించారు. ఈ నిర్ణయాన్ని మాజీ ప్రధాని, జేడీయూ అధ్యక్షుడు దేవెగౌడ స్వాగతించారు.