క్యాన్సర్‌తో బాధపడుతున్న పాకిస్థాన్ మాజీ ప్రధాన మంత్రి నవాజ్ షరీఫ్ భార్య కుల్సుమ్ షరీఫ్ 2017 నుంచి లండన్‌లోని ఓ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ మంగళవారం లండన్‌లో మృతి చెందినట్లు పాకిస్థాన్ ముస్లింలీగ్-నవాజ్ ప్రెసిడెంట్ షహాబాజ్ షరీఫ్ వెల్లడించారు.
అయితే అక్రమాస్తుల కేసులో జైలుశిక్ష అనుభవిస్తున్న పాకిస్థాన్ మాజీ ప్రధాన మంత్రి నవాజ్ షరీఫ్‌కు భార్య అంత్యక్రియలకు హాజరయ్యేందుకు పెరోల్ లభించింది. నవాజ్ షరీఫ్‌తో పాటు రావల్పిండిలో శిక్ష అనుభవిస్తున్న ఆయన కుమార్తె మరియం, అల్లుడు మహ్మద్ సఫ్దర్‌లకు కూడా షరతులతో కూడిన బెయిల్ మంజూరైంది.
పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ భార్య బేగం కుల్సూమ్ నవాజ్ మృతదేహం శుక్రవారం పాకిస్థాన్‌కు చేరుకుంటుందని పాకిస్థాన్ ముస్లింలీగ్-నవాజ్ ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. అయితే ఆమెను లాహోర్‌లోని షరీఫ్ కుటుంబానికి చెందిన నివాసంలో ఖననం చేస్తారని కుటుంబ సభ్యులు తెలిపారు.
గతంలో జైలుకు వెళ్లడానికి ముందు చివరిసారిగా భార్యను కలిసిన నవాజ్ ఆమె పక్కన నిలబడి..‘కుల్సూమ్ కళ్లు తెరువు. ఒక్కసారి కళ్లు తెరిచి నన్ను చూడు. అల్లా నీకు శక్తిని ప్రసాదిస్తాడు’ అన్నారు. ఈ వీడియోను సయ్యద్ హుస్సేన్ అనే వ్యక్తి తన ట్విటర్లో షేర్ చేశారు. దాంతో ఈ వీడియో కాస్తా సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
Unseen video of Nawaz engaging with Kulsoom before returning to Pakistan pic.twitter.com/WsGwnNgjIx
— Syed Talat Hussain (@TalatHussain12) September 11, 2018