బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ బాలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌లోను పలు చిత్రాలలో ఆయన నటిస్తున్నాడు. ఏడుపదుల వయస్సులోను ఎంతో ఎనర్జిటిక్‌గా చిరు 151వ చిత్రం సైరాలో రాజగురువు పాత్రలో కనిపిస్తున్నాడు. బాలీవుడ్లో అమితాబ్ నటించిన థగ్స్ ఆఫ్ హిందూస్థాన్ చిత్రం విడుదల కావలసి ఉంది.
మంచి టాలెంట్ ఉన్న నటీనటులకి స్వదస్తూరితో లెటర్స్ రాసి వారిని అభినందించడం బిగ్‌బీకి అలవాటు అన్న సంగతి తెలిసిందే. అయితే అమితాబ్ ఈ సారి తన తనయుడు అభిషేక్ బచ్చన్ నటించిన ‘మన్‌మర్జాయన్’చిత్రంలో నటించిన తాప్సీ, విక్కీ కౌశల్‌కి లేఖ రాసారు. అంతేకాదు వారికి బొకేలు కూడా పంపారు. అమితాబ్ నుండి బొకేతో కూడిన లెటర్ రావడంతో విక్కీ కౌశల్, తాప్సీ లు చాలా ఆనందంగా ఫీలై సోషల్ మీడియా ద్వారా సంతోషాన్ని తెలియజేశారు. అభిషేక్, తాప్సీ, విక్కీ విశాల్ ప్రధాన పాత్రలలో తెరకెక్కిన ‘మన్‌మర్జాయన్’ చిత్రం సెప్టెంబర్ 14న విడుదల కానుంది.
Finally !
THIS LETTER !
A milestone achieved ! pic.twitter.com/RnmqgkFEJ2— taapsee pannu (@taapsee) September 10, 2018
This means the world to me! Thank You @SrBachchan Sir for this hand written letter of appreciation and bouquet ??? #Manmarziyaan pic.twitter.com/TL3wYZvVwO
— Vicky Kaushal (@vickykaushal09) September 11, 2018