బుద్ధుందా అక్బరుడా
నోరా అది తాటి మట్ట !
హిందూ ముస్లిం ల మధ్య
బంధాలకు ఆనకట్ట !!
భరతగాలి పీలుస్తూ
బురదమాట లేల !
తేడాలెందుకు మనలో
అనవసరపు గోల !!
రాజకీయ లబ్దికొరకు
ఇంతటి దిగజారుడా !
ఎంతటి ధైర్యం నీకూ
ఓ శాసన సభ్యుడా !!
రామయ్యది రహీముదీ
ఎరుపే అందరి రక్తం !
నోరుజారి వాగుడేల
తప్పదు ప్రాయశ్చిత్తం !!
– ఏవీయస్