ఈ ఇంటి ఓట్లు అమ్మబడవు…


తెలంగాణ రాష్ట్రంలో తెరాస ప్రభుత్వం ముందుస్తు ఎన్నికలకు వెళ్లిన వేళా అన్ని పార్టీలు తమ వ్యూహాలు రచించడంలో సిద్దహస్తులు అయ్యాయి. ఓటర్లకు ఏ విధంగా దగ్గర అవ్వలో అన్ని విధాలా ప్రయత్నిస్తున్నాయి. అయితే జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం కోమళ్ల గ్రామానికి చెందిన తాళ్లపల్లి వెంకటస్వామి అనే వ్యక్తి ముందస్తు ఎన్నికల నేపథ్యంలో వినూత్న రీతిలో స్పందించాడు.

వివరాల్లోకి వెళితే ‘ఈ ఇంటి ఓట్లు అమ్మబడవు’ అని తాళ్లపల్లి వెంకటస్వామి తన ఇంటి గోడకు రాయించాడు. దీంతో పాటు ‘నా జాతి ప్రజలకు కత్తి చేతికివ్వలేదు.. ఓటు హక్కు ఆయుధంగా ఇచ్చాను.. పోరాడి రాజులౌతారో.. ఓడిపోయి (అమ్ముకొని) బానిసలు అవుతారో నిర్ణయం మీ చేతిలో ఉంది’ అన్న అంబేద్కర్ మాటలను కూడా పెయింటింగ్ వేయించాడు.

తాళ్లపల్లి వెంకటస్వామి చేసిన ఈ వినూత్న ప్రచారం ఆ ఊరు గ్రామస్తులు, యువతను అమితంగా ఆకర్షిస్తూ ఆలోచింపజేస్తుండడం విశేషం. ఇప్పుడు ఆ పెయింటింగ్ ఫోటో సోషల్ మీడియాలో కూడా వైరల్ గా మారడంతో ఏదో పెద్ద హాట్ టాపిక్ గా మారిపోయింది.