ఐదు టెస్టుల సిరీస్‌లో భాగంగా సౌతాంప్టన్‌లో జరుగుతున్న నాలుగో టెస్టులో రెండో రోజు తొలి ఇన్నింగ్స్‌లో అండర్సన్ బౌలింగ్‌లో ఫోర్ కొట్టిన కోహ్లీ అరుదైన రికార్డు నెలకొల్పాడు. ఈ ఫోర్‌తో ఆరు పరుగులు దాటిన కోహ్లీ 6 వేల పరుగులు సాధించిన భారత ఆటగాళ్ల జాబితాలో చేరాడు.
119 ఇన్నింగ్స్‌లలోనే ఆ ఘనత సాధించి సచిన్ టెండూల్కర్‌ను వెనక్కి నెట్టేశాడు. 117 ఇన్నింగ్స్‌లలోనే 6 వేల పరుగుల మైలు రాయిని చేరుకున్న సునీల్ గవాస్కర్ ఈ జాబితాలో ముందుండగా, కోహ్లీ రెండో స్థానంలో నిలిచాడు. 120 ఇన్నింగ్స్‌లలో 6 వేల పరుగులు చేసిన టెండూల్కర్ మూడో స్థానానికి పడిపోయాడు. ఆ తర్వాతి స్థానాల్లో వీరేంద్ర సెహ్వాగ్ (121), రాహుల్ ద్రవిడ్ (125) ఉన్నారు.
అంతర్జాతీయంగా అత్యంత వేగంగా 6వేల పరుగులు సాధించిన తొలి ఆటగాడి రికార్డు ఆస్ట్రేలియా ఆల్‌టైమ్ గ్రేట్ సర్ డొనాల్డ్ బ్రాడ్‌మన్ పేరున ఉంది. బ్రాడ్‌మన్ కేవలం 68 ఇన్నింగ్స్‌లలోనే ఈ ఘనత సాధించాడు. బ్రాడ్‌మన్ తరువాత వెస్ట్ ఇండీస్ ఆటగాడు జిస్ సోబెర్స్ (111) , ఆస్ట్రేలియా ఆటగాడు స్టీవ్ స్మిత్ (111) , ఇంగ్లాండ్ ఆటగాడు WR హంమొండ్ (114) స్థానాల్లో ఉండగా మన ఇండియా తరుపున 8వ స్థానంలో సునీల్ గవాస్కర్, 9వ స్థానంలో కోహ్లీ, 11వ స్థానంలో సచిన్ , 13 ,14వ స్థానాల్లో సెహ్వాగ్ ,ద్రావిడ్ ఉన్నారు.