యూఎస్ ఓపెన్‌లో ఫ్రాన్స్ ప్లేయర్ అలిజి కార్నెట్, స్వీడన్ ప్లేయర్ జొహన్నా లార్సన్ మధ్య మ్యాచ్ జరిగే సమయంలో ఎండ తీవ్రత నుంచి ఉపశమనం కోసం 10 నిమిషాల విరామాన్ని ప్రకటించారు. అయితే ఆ విరామంలో కార్నెట్ చేసిన పనే ఇప్పుడు తనకు తలనొప్పిగా మారింది. ఇంతకీ ఏం జరిగిందంటే.. తొలిమ్యాచ్‌లో కార్నెట్ తన టాప్‌ను సరిగా ధరించలేదు. కార్నెట్ చెమటతో తడిసిపోయిన తన షర్ట్‌ను కోర్టులోనే విప్పేసి మళ్లీ వేసుకుంది.
ఈ క్రమంలో ఆమె లోపల వేసుకున్న స్పోర్ట్స్ బ్రా కెమెరాల్లో కనిపించింది. వెంటనే దీన్ని గుర్తించిన చైర్ అంపైర్.. కార్నెట్ క్రీడా నిబంధనలను ఉల్లంఘించిందని హెచ్చరించారు. కానీ నిర్వాహకులు మాత్రం ఈ అంశంలో నిబంధనల ఉల్లంఘన జరుగలేదని తెలిపారు. చైర్ అంపైర్ ఇలా హెచ్చరించడాన్ని టెన్నిస్ అభిమానులు తీవ్రంగా తప్పుపడుతున్నారు. ఉక్కపోతతో కార్నెట్ అలా చేసిందే కానీ.. ఉద్దేశపూర్వకంగా కాదు కదా అంటూ అభిమానులు సోషల్ మీడియా ద్వారా మండిపడుతున్నారు.
మ్యాచ్ మధ్యలో పురుషు ఆటగాళ్లు షర్ట్ విప్పేస్తే లేని ఇబ్బంది మహిళా క్రీడాకారిణిల విషయంలో ఎందుకు రాద్ధాంతం చేస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. ఆటలో అందరూ సమానులేనని, ఏ విషయానైనా క్రీడాస్ఫూర్తిగా తీసుకోవాలంటున్నారు. అయితే.. డబ్ల్యూటీఏ నిబంధనల ప్రకారం మహిళా ప్లేయర్లు కోర్టులో బట్టలు మార్చుకోకూడదు. పురుషులు మార్చుకోవచ్చు.
Cornet( info – @nicklester , @BenRothenberg,@ymanojkumar)(?Eurosport) pic.twitter.com/RlfQT3t77a
— doublefault28 (@doublefault28) August 28, 2018