నాని, బ‌న్నీల సంద‌డి చూస్తారా …

ఈ మధ్య స్టార్ హీరోలు ఒకరి వేడుకకి ఒకరు వెళ్లడం చూస్తున్నాం. అందరూ హీరోలు మంచి మిత్రలుగా ఉంటున్నారు. ఒకరి సినిమా మరొకరు ప్రచారం లాంటివి చేస్తున్నారు. ఇప్పుడు స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్ మరియు నాచురల్ స్టార్ నాని వీరిద్ద‌రు కలసి సందడి చేసారు. రీసెంట్‌గా హుషారైన పాట‌ల‌తో , అద‌ర‌గొట్టే స్టెప్పుల‌తో వారు చేసిన సంద‌డి అంతా ఇంతా కాదు. కామ‌న్ ఫ్రెండ్ వివాహానికి హాజ‌రైన వీరిద్ద‌రు ఆ ఫంక్ష‌న్‌లో నానా హంగామా చేశారు.

‘ఆర్య-2’ చిత్రంలోని ‘ఉప్పెనంత ఈ ప్రేమకి’ అనే పాటని అల్లు అర్జున్‌ పాడుతూ ఉంటే ఆయన సతీమణి స్నేహారెడ్డి స్టెప్పులేశారు. నాని నటించిన ‘నిన్నుకోరి’ చిత్రంలోని ‘అడిగా అడిగా’ పాటని నాని తన సతీమణికోసం పాడుతుంటే అక్కడుండే వారందరూ ఒక్కసారిగా ఈలలు వేసి గోల‌లు చేశారు. దీంతో పాటు బన్ని, నాని కలిసి‘ ఎటో వెళ్లి పోయింది మనసు’ చిత్రంలోని ‘ ప్రియతమా నీవచట కుశలమా?’అన్న పాట పాడటం అలరిస్తోంది. ఈ కార్య‌క్ర‌మానికి సంబంధించిన వీడయోలని బ‌న్నీ త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయ‌డంతో ఇవి వైర‌ల్‌గా మారాయి.

ఇది రీసెంట్ వీడియోనా లేదంటే కొన్ని రోజుల క్రితం జ‌రిగిన ఫంక్ష‌న్‌కి సంబంధించిన వీడియోన అనేది మాత్రం తెలియదు. ప్రస్తుతానికి నాని దేవదాస్‌తో పాటు జ‌ర్సీ అనే చిత్రంతో బిజీగా ఉన్నాడు. అలాగే బన్నీ సినిమా కథలను వినే పనుల్లో ఉన్నాడు.