ఈ మధ్య కాలంలో సెలబ్రిటీస్ కానుంచి సామాన్యులు వరకు ఛాలెంజ్ లు ఎక్కువగా చేస్తున్నారు. మొక్కలు నాటడం, యోగ చేయడం, శుభ్రత ఛాలెంజ్ మొదలగునవి మనం రోజు ఏదో మూల చూస్తూనే ఉన్నాము.ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో వస్తున్న ఛాలెంజ్‌లకి జనాలు ఎంతగా ఆకర్షితులు అవుతున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
ఇప్పుడు కొత్తగా బచ్చేఫిట్తోదేశ్ఫిట్ అనే ఛాలెంజ్ వైరల్ అవుతుంది. తన తండ్రి రితేశ్ దేశ్‌ముఖ్ విసిరిన ఫిట్నెస్ చాలెంజ్‌ను స్వీకరించిన రెండేళ్ల రెహిల్, రోప్ సాయంతో గోడ మీదకి ఎక్కుతూ చాలెంజ్ పూర్తి చేశాడు. ఇప్పుడు రెహిల్ దానిని బీ టౌన్ స్టార్ కిడ్స్ తైమూర్, అబ్రామ్, ఆరాధ్య బచ్చన్, ఇనాయా ఖేము, మిషాలకు విసిరాడు.
బొమ్మరిల్లు సినిమాలో హాహా హాసిని అంటూ తెలుగు ప్రేక్షకులను ఎంతగానో అలరించిన జెనీలియా 2012 ఫిబ్రవరి 3న రితీష్ దేశ్‌ముఖ్‌ను వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఈ జంటకు 2014 లో రియాన్ అనే మగ బిడ్డ జన్మించారు. ఇప్పుడు #బచ్చేఫిట్తోదేశ్ఫిట్’ అంటూ క్యాప్షన్ జత చేసి రెహిల్ వీడియోని షేర్ చేసింది జెనీలియా. ఇది చూసిన కరణ్ జోహార్…‘ ఓ మైగాడ్!! చూడండి!! ఇతను రాక్‌స్టార్. నేనైతే రెహిల్లా చాలెంజ్ పూర్తి చేస్తానో లేదో’ అంటూ ఫన్నీ కామెంట్ పెట్టాడు. మరి రానున్న రోజులలో ఈ ఛాలెంజ్ ఎంతగా ఆదరణ పొందుతుందో చూడాలి.
OMG!!! Look at him!!!! He’s a rock star!!!! Am nervous to even attempt this with mine??? https://t.co/nihN0wVjyz
— Karan Johar (@karanjohar) August 29, 2018