అత్యాచారాల నివారణకు 5 సూత్రాలు : వెంకయ్య నాయుడు

venkaiah-naiduదేశవ్యాప్తంగా మహిళలపై అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయని, ఈ ఘటనలు మన వ్యవస్థనే సవాలు చేస్తున్నాయని బీజేపీ సీనియర్ నేత వెంకయ్య నాయుడు విచారం వ్యక్తం చేశారు. ఈ రోజు ఆయన హైదరాబాద్ లో విలేకరులతో మాట్లాడుతూ… ఢిల్లీలో యువతిపై అత్యాచారం, హత్య ఘటనలపై సత్వర న్యాయం కోసం కేంద్ర ప్రభుత్వాన్ని తాము ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు, అఖిలపక్ష సమావేశాని నిర్వహించాలని కోరామన్నారు.

అయితే దీనిపై కేంద్ర స్పందించలేదని ఆయన అన్నారు. ఇలాంటి ఘటనలపై సామాన్య ప్రజలు రోడ్డెక్కితే తప్ప ప్రభుత్వం స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలపై అత్యాచారాల నివారణకు ఐదు సూత్రాలు పాటించాలని వెంకయ్య నాయుడు సూచించారు. రాజకీయ ధృడ సంకల్పం, జవాబుదారీతనంతో కూడిన పరిపాలన వ్యవస్థ, మహిళల పట్ల ప్రజల ఆలోచనావిధానం మారడం, ప్రసార మాధ్యమాలు స్త్రీ విలువ పెంచేలా వ్యవహరించడం వంతి సూత్రాలు అమలు వెంకయ్య అన్నారు.

మత విద్వేషాలు రెచ్చగొట్టేలా ప్రసంగాలు చేసిన ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ పై ప్రభుత్వం కేసులు పెట్టాలని ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు. ఈ విషయాన్ని తాము వదిలిపెట్టమని జాతీయస్థాయిలో చర్చకు పెడతామన్నారు. ఇప్పటివరకు ఎమ్మెల్యేపై కేసులు ఎందుకు పెట్టలేదో ప్రభుత్వం ప్రజలకు సమాధానం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.