బుధవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో హరికృష్ణ మరణించిన విషయం తెలిసిందే. సినీ, రాజకీయ ప్రముఖులు ఆయనకు నివాళులు అర్పిస్తున్నారు. కీరవాణి గారు ఆయనకు నివాళులు అర్పిస్తు, ఈ సందర్భంగా ఆయన గురించి ” హరికృష్ణ భేషజాల్లేని మనిషని ” ఓ ఆసక్తికరమైన విషయాన్ని ట్విటర్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు.
ఎన్టీఆర్ సీఎం గా ఉన్నపుడు ఒక హరికృష్ణ గారు కారు లో వెళ్తున్నారు. ముషిరాబాద్ లో ట్రాఫిక్ సిగ్నల్ దాటారన్న కారణంతో ఓ పోలీస్ ఆయన్ను ఆపి చలానా రాసారు. అయితే తాను ఎన్టీఆర్ కుమారుడినని మాత్రం హరికృష్ణ చెప్పలేదు. తన తప్పును తెలుసుకుని చలానా కట్టి వెళ్లిపోయారట. అని కీరవాణి గారు హరికృష్ణ గారితో ఉన్న జ్ఞాపకాలను గుర్తుకు తెచ్చుకున్నారు.
?????? pic.twitter.com/CCuf9gJUt3
— mmkeeravaani (@mmkeeravaani) August 30, 2018