హరికృష్ణ మృతదేహానికి పోస్టుమార్టం పూర్తయింది. కామినేని ఆస్పత్రిలో పోస్టుమార్టం వ్యవహారాలను పూర్తిచేశారు. అనంతరం అంబులెన్స్‌లో పార్ధీవదేహాన్ని హైదరాబాద్‌కు తరలిస్తున్నారు. హరికృష్ణ భౌతికకాయం వెంట బాలకృష్ణ, దర్శకుడు త్రివిక్రమ్, కుమారులు ఎన్టీఆర్, కల్యాణ్‌రామ్ , ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, మంత్రి లోకేశ్ రోడ్డుమార్గం ద్వారా హైదరాబాద్ బయల్దేరారు.
అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషికి సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. హరికృష్ణ కుటుంబ సభ్యులను సంప్రదించి అంత్యక్రియ ఏర్పాట్లను చేయాలని సీఎస్‌ను సీఎం ఆదేశించారు. రేపు హరికృష్ణ అంత్యక్రియలు జరగనున్నాయి. శంషాబాద్ దగ్గరగల ఫాంహౌస్‌లో హరికృష్ణ అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తున్నారు. పెద్దకుమారుడు జానకిరామ్ అంత్యక్రియలు జరిగిన చోటే హరికృష్ణ అంత్యక్రియలు జరపాలని నిర్ణయించారు.