హరికృష్ణ రోడ్డు ప్రమాదానికి గురయ్యారని తెలియగానే గాయాలతో బయటపడతారని అనుకొనేలోపే విషాద వార్త వినాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. సినీ, రాజకీయ రంగాల్లో ఆయన చేసిన సేవలు మరచిపోలేనివని చెప్పారు. ఈ విషాద సమయంలో కుటుంబ సభ్యులు ధైర్యంగా ముందుకెళ్లేందుకు భగవంతుడు శక్తి ఇవ్వాలని ప్రార్థిస్తున్నట్లు పవన్ తెలిపారు.
ఈ రోజు జనసేన కార్యాలయంలో ముఖ్య నాయకుల చేరికలు, గిడుగు రామ్మూర్తి జయంతి వేడుకలని రద్ధు చేస్తున్నట్టు ఆయన ట్విట్టర్ ద్వారా తెలిపారు.
#Janasena chief @PawanKalyan's condolence message on the demise of #NandamuriHarikrishna garu pic.twitter.com/vQ7vVIQmdJ
— BARaju (@baraju_SuperHit) August 29, 2018