త‌మిళ టెంపర్ లో విశాల్

టెంపర్ సినిమాకు ముందు ఎన్టీఆర్ అప్పటి వరకు మూస కథలతో సినిమాలు చేస్తూ తనకు ఉన్న ఇమేజ్ పోగుట్టుకుంటున్న సమయంలో, డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ తో మూసకథను కాకుండా తన ఇమేజ్ ను సైతం పక్కన పెట్టి ఒక ప్రయోగమే చేసాడు. ఆ ప్రయోగమే టెంపర్ సినిమా. ఆ ప్రయోగం ఏ మాత్రం తేడాకొట్టిన తన ఇమేజ్ మొత్తం పోయేది. కానీ టెంపర్ సినిమా సబ్జెట్ ఒక యూనివర్సల్ సంబంధించింది కాబట్టే అన్ని భాషల్లో రీమేక్ అవుతుంది.

తెలుగులో ఎన్టీఆర్‌ హీరోగా, కాజ‌ల్ హీరోయిన్ గా, పోసాని కృష్ణ మురళి, ప్రకాష్ రాజ్ ప్ర‌ధాన పాత్ర‌లో రూపొందిన టెంపర్ చిత్రం బాక్సాఫీస్ ద‌గ్గ‌ర బంప‌ర్ హిట్ కొట్టింది. ఇప్పుడు ఈ మూవీ హిందీలో రీమేక్ అవుతుంది. సింబా అనే టైటిల్ తో రోహిత్ శెట్టి ద‌ర్శ‌క‌త్వంలో ర‌ణ్‌వీర్ సింగ్ ప్ర‌ధాన పాత్ర‌లో రూపొందుతుంది. ర‌ణ్‌వీర్ సంగ్రామ్‌ భలేరావ్‌ పాత్రలో నటిస్తున్నారు. ధర్మ ప్రొడక్షన్స్‌, రిలయన్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఆర్‌ఎస్‌ పిక్చర్స్‌ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

తాజాగా ఈ చిత్రం త‌మిళంలోను రూపొందుతుంది. పందెం కోడి సినిమాతో తెలుగులో పేరు తెచ్చుకున్న విశాల్ ప్ర‌ధాన పాత్ర‌లో అయోగ్య అనే టైటిల్‌తో త‌మిళ రీమేక్ చేయ‌నున్నారు. సినిమాలో కథానాయికగా రాశి ఖన్నా నటించనుండగా, పార్తీబన్ కీలకమైన పాత్రలో కనిపించనున్నాడు. అయోగ్య సినిమాకు వెంకట్ మోహన్ దర్శకత్వం వహిస్తున్నాడు. తమిళ రీమేక్ కి సంబంధించిన పూజా కార్యక్రమాలు చెన్నైలో పూర్త‌య్యాయి. కలైపులి థాను, మురుగదాస్, లింగుస్వామి, కేఎస్ రవికుమార్ తదితరులు ఈ పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు.