సోషల్ మీడియా సంచలనం ప్రియా ప్రకాష్ వారియర్ గుర్తుందా? అదేనండి మలయాళ సినిమా ఓరు ఆదార్ లవ్ లోని ఒక పాటలో కన్ను కొట్టి యావత్ ప్రపంచానికి ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన 18 ఏళ్ల అమ్మాయే ప్రియా ప్రకాష్ వారియర్. ఇప్పుడు ప్రియా హైదరాబాద్ నగరానికి ప్రియా వారియర్ వస్తోంది. అవును ఇది నిజం.
ఎందుకంటే ఆగస్ట్ 26న హైదరాబాద్‌లో జరగబోతోన్న 16వ సంతోషం సౌత్ ఇండియన్ ఫిల్మ్ అవార్డ్స్ 2018 వేడుకలలో ‘బెస్ట్ ఫేస్ ఆఫ్ ద ఇయర్’ అవార్డును అందుకునేందుకు హైదరాబాద్ రాబోతుంది. సంతోషం అధినేత సురేష్ కొండేటి అఫీషియల్‌గా ఈ విషయాన్ని తెలియజేస్తూ, ఆమె మాట్లాడిన వీడియోను ట్విట్టర్లో విడుదల చేశారు. వెంకటేష్, రామ్ చరణ్, ప్రభాస్, సమంత, విజయ్ దేవెరకొండ, తమన్నా, సాయిపల్లవిలు వివిధ కేటగిరిలో నామినేట్ అయ్యారు.JRC కన్వెన్షన్ లో జరగబోయే ఈ వేడుకకు ముఖ్య అతిథిగా మెగాస్టార్ చిరంజీవి రానున్నారు. ప్రతిష్టాత్మకంగా జరుగనున్న ఈ అవార్డుల ఫంక్షన్ భారీగా జరపబోతున్నట్లుగా ఇప్పటికే ఆయన తెలిపారు.
Thank You #PriyaPrakashVarrier For Your Immediate Responce & Accepting My Invitation for Santosham South Indian Film Awards 16th Anniversary 2018 Which we will be Held on 26th August at Jrc Convention. pic.twitter.com/r2D6q3Q7L1
— Suresh Kondeti (@santoshamsuresh) August 23, 2018