ఢిల్లీ లో జాతీయ మీడియా తో చంద్ర బాబు నాయుడు గారు మాట్లాడుతూ : ప్రధాన మంత్రి మోడీ గారు ఎన్నికల ప్రచారం లో తిరుపతి లో వెంకన్న సాక్షిగా ఆంధ్ర ప్రదేశ్ కు ప్రత్యేక హోదా కల్పిస్తామని, అలాగే నెల్లూరు సభలో సీమాంధ్ర అభివృద్ధి కి సహకరిస్తామని, ఎన్నికల తరువాత అమరావతి శంకుస్థాపన నాడు గుప్పెడు మట్టి , గంగా యమునా నదుల నీరు తీసుకొనివచ్చి ఆంధ్రను ఆదుకుంటామని చెప్పారు. కానీ ఇప్పుడు ఆ మాటను మోడీ తప్పారు.
నిన్న జరిగిన పార్లమెంట్ సమావేశాలలో నాపై మోడీ గారు చేసిన వ్యాఖ్యలు నన్ను బాధించాయి.అనుభవం లేని రాజకీయ నాయకులతో నన్ను పోల్చారు. ఆంధ్రప్రదేశ్ విభజన కష్టాలతో చాల నష్ట పోయింది. మేము పోరాటం చేస్తూనే అభివృద్ధి లో పోటీ పడుతున్నాం. 125 ఏళ్ల చరిత్ర కలిగిన కాంగ్రెస్ కు విభజన తరువాత ఆంధ్రలో 2 శాతం ఓట్లువచ్చాయి. మీరు కాంగ్రెస్ ను విమర్శిస్తున్నారు, మరి ఇప్పుడు మీరు చేస్తుంది ఏంటి? యూ టర్న్ మేము తీసుకోలేదు. ఇచ్చిన హామీలు అమలు చేయడంలో మీరే యూ టర్న్ తీసుకొన్నారు.హోదా విషయంలో 14వ ఆర్థిక ప్రణాళిక సంఘం పేరుతో మీరే తప్పుదోవపట్టిస్తున్నారు.ఎవరికీ ప్రత్యేక హోదా లేదన్నారు. హోదా కు సమానంగా నిధులు ఇస్తామన్నారు .ఎవరికీ పన్ను రాయితీలు లేవని చెప్పి 11 ఈశాన్య రాష్ట్రాలకు ఇస్తున్నారు. ఆ రాష్ట్రాలకు రాయితీలు ఇస్తున్నప్పుడు మాకు ఎందుకు ఇవ్వరు అని అడిగేతే ఆ రాష్ట్రాలు వేరు, ఆంధ్ర వేరు అని వాదిస్తున్నారు, అందుకే మేము అవిశ్వాసం పెట్టాం.
హైదరాబాద్ నా మానస పుత్రిక .గొప్పతనంతో హైదరాబాద్ ను అభివృద్ధి చేశా. కెసిఆర్ పరిణితి చెందిన వారని ,నేను కాదని మోడీ గారు చెపుతున్నారు. మేము వివాదాలు సృష్టిస్తున్నట్లు ఆయన పరిష్కారం చేస్తున్నట్లు చెపుతున్నారు. ఆంధ్రకు న్యాయం జరుగుతుందని బీజేపీ తో కలిశాను.ఆంధ్ర ప్రయోజనాలు కోసం 29 సార్లు ఢిల్లీ పర్యటన చేశాను. సంఖ్యా బలం ఉంటుందని తెలుసు ,అయినా అవిశ్వాస తీర్మానం పెట్టాం. 15 ఏళ్ల తరువాత మేమే అవిశ్వాస తీర్మానం పెట్టాం.ఆంధ్రకు జరిగిన అన్యాయాన్ని తెలియజేయడానికి ఈ తీర్మానం చేశాం.మెజారిటీకి , నైతికకు మధ్య జరిగిన పోరాటమిది.నేను తప్పు చేయనంత వరకు భయపడను.లోక్ సభలో మా ఎంపీ లు అద్భుతంగా పోరాడారు. అవిశ్వాస తీర్మానానికి మద్దతిచ్చిన పార్టీలకు నా కృతజ్ఞతలు .అని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు.