నాయక్ జోరూ, హోరూ …

Ramcharan nayak in swing‘నా జోలికొస్తే క్షమిస్తా… నావాళ్ళ జోలికొస్తే అడ్డంగా నరికేస్తా..’ అంటూ తొడ గొడుతున్నాడు… రామ్ చరణ్. ‘నాయక్’ ట్రైలర్ లో ఈ సంభాషణ అభిమానులను తెగ ఊపేస్తోంది. చిరు ఫాన్స్ కి ఎలాంటి అంశాలు కావాలో దర్శకుడు వినాయక్ కి బాగా తెలుసు. అయన కూడా మెగా స్టార్ అభిమానే. చిరు తనయుడిని కుడా ఓ రేంజ్ లో చూపించాలనే కోరిక ఆయనకీ వుంటుంది. అందుకే.. ‘నాయక్’లో రామ్ చరణ్ పాత్రని కనీ వినీ ఎరుగని రీతిలో పవర్ ఫుల్ గా తీర్చిదిద్దారట. పైగా ఈ సినిమా కోసం తొలిసారి చరణ్ ద్విపాతాభినయం చేసారు. రెండు పాత్రల్లో రెండు రకాలుగా తెరకెక్కించారట. ‘నాయక్’ పాటలు ఇప్పటికే మెగా అభిమానులని కిక్ ఎక్కిస్తున్నాయి. ‘శుభలేఖ రాసుకున్న..’ పాట అలరించడం ఖాయం అని వినాయక్ చెబుతున్నారు. అంతే కాదు…. ఈ పాటలో చరణ్.. చిరుని అనుకరిస్తూ డాన్సు చేసాడట. లోకేషన్లు కూడా అద్భుతంగా కుదిరాయట.

Nayak Movie Stills(2)సంక్రాంతి కి వారం రోజుల ముందే రామ్ చరణ్ టాలీవుడ్ లో పండగ వాతావరణం తీసుకు రావడం ఖాయం అని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ‘రచ్చ’లాంటి… ఓ మాదిరి సినిమానే ఫాన్స్ సూపర్ హిట్ చేశారు. ఇక వినాయక్ పకడ్బందీ వ్యూహం తో రూపొందించిన ‘నాయక్’ రికార్డులు బద్దలుగొట్టడం ఖాయం అనేది వారి మాట. పైగా ఈ పండక్కి ‘సీతమ్మ వాకిట్లో..’ తప్ప పెద్ద పోటీ ఏమీ లేదు. చిరు ఫ్యామిలీ 2012లో… విజయడంఖా మోగించింది. అదే జోరు కొత్త ఏడాది లోనూ చూపించే అవకాశాలు వున్నాయి. ‘చరణ్ ని చూస్తే చిరంజీవి ని చూస్తున్నట్టు వుంది. అభిమానులకూ అదే అనిపిస్తుంది’ అని వినాయక్ హామీ ఇస్తున్నారు. ఆయన ‘నాయక్’ సినిమాపై చాలా శ్రద తీసుకున్నారు. దానికీ ఓ కారణం వుంది. చిరంజీవి 150 వ సినిమా ఎప్పుడు ప్రస్తావనకు వచ్చినా.. వినాయక్ పేరు వినిపించేది. భవిష్యత్తులో చిరు 150వ సినిమాకి పచ్చ జండా వూపితే… వినాయక్ పేరు పరిశీలిస్తారు. అప్పుడు ‘నాయక్’ ఫలితం కీలకం కానుంది. అందుకే ఈ సినిమాని చాలా కేర్ తీసుకుని చేశారట. మాస్, యాక్షన్ అంశాల మేలవింపుతో పాటు.. చిరు అభిమానులకు నచ్చే సంభాషణలూ జోడిస్తే… ఈ సినిమా సంక్రాంతి విజేతగా నిలవడం ఖాయం. మెగా అభిమానులూ అదే కోరుకుంటున్నారు.